- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డ్రైనేజీల వద్ద క్రాకర్స్ కాలుస్తున్నారా.. అయితే మీ పిల్లలు డేంజర్‌లో ఉన్నట్లే!
దిశ, డైనమిక్ బ్యూరో : దీపావళి వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఇంటిల్లిపాదీ సందడిగా గడుపుతుంటారు. ఇక పిల్లలైతే పండుగకు వారం రోజుల ముందు నుంచే బాణసంచా కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, దీపావళి వేళ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం ఉన్న పట్టణాల్లో బాణసంచా కాల్చే సమయంలో మరింత జాగ్రత్త అవసరం అంటున్నారు.
డ్రైనేజీ వ్యర్థాల ద్వారా తయారయ్యే మిథేన్ వాయువు అగ్నిని పుట్టిస్తుంది. అందువల్ల పిల్లలు తెలియకుండా బాణసంచా కాల్చడం, పేపర్లను కాల్చే సమయంలో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు క్రాకర్స్ పేల్చే సమయంలో తల్లిదండ్రులు దగ్గరుంటే మేలు. అయితే, గతంలో ఇలాంటి ప్రమాదాలు పలు చోట్లు జరిగాయి. డ్రైనేజీ మ్యాన్ హోల్ వద్ద పిల్లలు తెలియకుండా బాణసంచాను పేల్చే క్రమంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి. pic.twitter.com/sgfwMuwLKJ
— Sushil Rao (@sushilrTOI) November 3, 2021