కోకాకోలాలో భారీగా ఉద్యోగాల తొలగింపు!

by Harish |   ( Updated:2020-12-18 07:28:02.0  )
కోకాకోలాలో భారీగా ఉద్యోగాల తొలగింపు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం వల్ల పలు రంగాల్లో అనేక సంస్థలు ఉద్యోగాలను తొలగించడం, వేతనాల తగ్గింపును అమలు చేశాయి. అయితే, గత మూడు నెలల నుంచి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. అయితే, కొన్ని కంపెనీల్లో మాత్రం కరోనా ప్రభావం ఇంకా బయటపడలేదు. తాజాగా ప్రముఖ పానీయాల సంస్థ కోకాకోలా ప్రపంచవ్యాప్తంగా 2200 మందిని తొలగించడానికి నిర్ణయించినట్టు సమాచారం. వర్క్ ఫోర్స్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్‌లో భాగంగా కోకాకోలా ఈ ఉద్యోగాల తొలగింపును అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.

అత్యధికంగా అమెరికా మార్కెట్లో సుమారు 1200 మందిని తొలగించనుంది. కరోనా వల్ల కంపెనీ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు 9 శాతం మేర క్షీణించాయి. ఈ పరిస్థితుల్లో వ్యాపార పునర్నిర్మాణం కోసం పోర్ట్‌ఫోలియోను తగ్గించే ప్రణాళికను వేగవంతం చేసి కరోనా సంక్షోభం నుంచి బయటపడాలని భావిస్తోంది. ఇప్పటికే విక్రయాలు సరిగాలేని పలు బ్రాండ్ ఉత్పత్తులను ఆపేసింది. ముఖ్యంగా కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగాల కోత ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed