ఎడతెరిపి లేని వర్షం.. సింగ‌రేణిలో నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి

by Sridhar Babu |   ( Updated:2020-08-10 07:00:43.0  )
ఎడతెరిపి లేని వర్షం.. సింగ‌రేణిలో నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం తెల్లవారుజాము నుంచి విస్తారంగా వర్షం పడుతోంది. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి గ్రామాల్లో చిన్నచిన్న నీటి కుంటలు చెరువులు జలకళను సంతరించుకున్నాయి.

అలాగే కొత్తగూడెం సింగరేణి.. ఉపరితల బొగ్గు గని జీకే ఓసీలో బొగ్గు ఉత్పత్తి అంతరాయం ఏర్పడింది. సుమారు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా ఓసీలోకి వరద నీరు చేరడంతో మోటార్ల సాయంతో నీటిని సిబ్బంది బయటికి పంపుతున్నారు. ఓసీలో వర్షం కారణంగా బురద ఉండటంతో ఓబీ మట్టి తీత పనులకు పూర్తిగా నిలిచిపోయాయి. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్నీ బురదమయం కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed