- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూపీ హింసాకాండ.. ఆ రైతు కుటుంబాలకు రూ.45 లక్షల పరిహారం
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆదివారం కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పార్టీల మద్దతుతో రైతులు యూపీలోని లఖీంపూర్ కేరీలో నిరసనకు దిగారు. అదే సమయంలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం రైతుల మీద నుంచి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తర్వాత చెలరేగిన హింసలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు కూడా మృతి చెందినట్టు సమాచారం.
తాజాగా ఈ హింసాకాండ విషయంలో దిద్దుబాటు చర్యలకు యూపీ సర్కార్ నిర్ణయించింది. ప్రమాదంలో మరణించిన రైతు కుటుంబాలకు రూ.45లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆదేశించింది. అంతేకాకుండా గాయపడిన వారికి రూ.10లక్షల నష్టపరిహారం అందించనున్నట్టు పేర్కొంది. రైతుల ఫిర్యాదు మేరకు ఈ కేసు విచారణ చేపట్టనున్నట్టు యూపీ పోలీసులు తెలిపారు. అయితే, కేంద్ర మంత్రి తనయుడు ఆశీష్ మిశ్రా రైతుల మీదకు కారు ఎక్కించారని, అతన్ని అరెస్టు చేయాలని యూపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.