రోజైనా గడవలేదు.. అప్పుడే కేంద్ర బృందాలు

by Shamantha N |
CM Mamata Banerjee
X

కోల్‌‌కతా: పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర బలగాలు చేరడంపై సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీపై విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 24 గంటలైనా గడవలేదని, అప్పుడే కేంద్ర బృందాలు, కేంద్రమంత్రులు వస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం బయటి నుంచి ఎవరు వచ్చినా, ప్రత్యేక విమానంలో వచ్చినా అందరికీ నిష్పక్షపాతంగా ఆర్టీ పీసీఆర్ టెస్టు చేస్తామని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో హింస చెలరేగింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం మంత్రులు, దర్యాప్తు బృందాలను పంపింది. కొందరు కేంద్రమంత్రులు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రెచ్చొగొడుతున్నారని, తాము రాజకీయపరమైన సభలు, సమావేశాలన్నింటినీ రద్దు చేశామని సీఎం వివరించారు. ప్రజల ఓటు తీర్పును బీజేపీ గౌరవించడం లేదని, అందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. బీజేపీ ఓట్లు పడ్డ ప్రాంతాల్లోనే హింస జరుగుతున్నదని తెలిపారు. హింసలో మరణించినవారిలో సగం మంది తృణమూల్‌కు చెందినవారేనని, మరోసగం బీజేపీ వారని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed