- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM: నేడు వరంగల్ ఎంజీఎంకు సీఎం
దిశ ప్రతినిధి, వరంగల్ : సీఎం కేసీఆర్ నేడు వరంగల్ ఎంజీఎంను సందర్శించనున్నారు. ఇటీవల సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ లను పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం వరంగల్ ఎంజీఎంకు కూడా రానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సీఎం పర్యటన వివరాలు..
1. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారు.
2. అనంతరం రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లనున్నారు.
3. 11.45 గంటలకు వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించనున్నారు.
4. మధ్యాహ్నం 2 గంటలకు ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించనున్నారు.
5. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
కాకతీయ మెడికల్ కాలేజీని ఆనుకొని ఉన్న జైలును ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం జైలును సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి కెప్టెన్ ఇంటికి చేరుకొని భోజనం చేయనున్నారు. ఆ తర్వాత ఎంజీఎం వెళ్లి రోగులతో మాట్లాడడంతో పాటు ఆసుపత్రిలోని మౌలిక వసతులను పరిశీలిస్తారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.