- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ మాస్కు పెట్టుకున్నారు…!
దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా భూతాన్ని ప్రజలు కళ్ళారా చూస్తున్నదే. చైనాలో ఈ వైరస్ తొలుత వచ్చినప్పుడు అక్కడి ప్రజలు మాస్కులు ధరించే ఫోటోలు, వీడియోలు చూసి సోషల్ మీడియాలో చాలా సెటైర్లే వచ్చాయి. కానీ అది మన దాకా వచ్చేసరికి సెటైర్లు బందయ్యాయి. కానీ ప్రధాని, చాలా మంది ముఖ్యమంత్రులు మాత్రం మాస్కు ధరించిన సందర్భాలు లేవు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా ప్రధాని మోడీ మాస్కుతో దర్శనమిచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ముఖానికి మాస్కు ధరించి కనిపించారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం మాస్కు ధరించడాన్ని నిర్బంధం చేసింది. చాలా రాష్ట్రాలు కూడా దీన్ని తప్పనిసరి చేశాయి. అయినా చాలా మంది రోడ్ల మీద మాస్కు లేకుండానే తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్కు ధరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతీ ఒక్కరూ ఇంటి గడప దాటి బైటకు వచ్చేటప్పుడు మాస్కు ధరించాలన్న సందేశాన్ని ఇవ్వడం దీని వెనక ఉద్దేశం కావచ్చన్నది పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు అంచనాకు భిన్నంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తల్లో భాగంగా మాస్కు ధరించారేమో అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రతీరోజూ విరాళాలను చెక్కు రూపంలో అందించడానికి పెట్టుబడిదారులు, వ్యాపారులు ప్రగతి భవన్‌కు క్యూ కడుతున్నారు. కరోనా కట్టడి కోసం జరుగుతున్న సమీక్షా సమావేశాలకు మంత్రులు, అధికారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది హాజరవుతున్నారు. వైద్యారోగ్య సిబ్బంది దగ్గరకు చాలా మంది డాక్టర్లు, ఆసుపత్రులతో సంబంధం ఉన్న వ్యక్తులను కలిసినవారు వస్తూ ఉంటారు. కొద్దిమంది వైద్య సిబ్బందికి పాజిటివ్ సోకింది. మరికొద్దిమందికి లక్షణాలు కనిపించాయి. ఇంకొంతమంది క్వారంటైన్‌లో ఉన్నారు. అదే విధంగా ప్రతీ రివ్యూ సమావేశానికి డీజీపీ కూడా హాజరవుతున్నారు. పోలీసు శాఖలో సైతం పలువురికి కరోనా పాజిటివ్, ఇన్‌ఫెక్షన్ సోకడం, కొద్దిమంది క్వారంటైన్‌లో ఉన్నారు. సమీక్షా సమావేశాలకు హాజరయ్యేవారి ద్వారా కరోనా వ్యాప్తి జరగవచ్చనే అనుమానం కూడా కేసీఆర్ మాస్కు ధరించడానికి ఒక కారణం కావచ్చు. తొలిసారిగా ముఖానికి మాస్కు పెట్టుకుని కేసీఆర్ ఫోటో బైటకు రావడం రకరకాల చర్చలకు అవకాశం ఇచ్చింది.
Tags: Telangana, Corona, CM KCR, Face mask, spreading