సెక్రటేరియట్ ప‌నులు ప‌రిశీలించిన సీఎం కేసీఆర్‌

by Shyam |   ( Updated:2021-01-26 07:38:32.0  )
సెక్రటేరియట్ ప‌నులు ప‌రిశీలించిన సీఎం కేసీఆర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ‌నూత‌న స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిశీలించారు. మంగళవారం సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణంలో కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచనలు చేశారు. ప్రధాన గేట్‌తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను పరిశీలించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు వేముల ప్ర‌శాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారులు, ఇంజినీర్లు, అధికారులు తదితరులున్నారు.

Advertisement

Next Story