- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ప్రతిపల్లె బాగుపడాలి: కేసీఆర్
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో పల్లెల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక ఉండాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో సీఎం సమావేశం అయ్యారు. గ్రామాల్లో కలెక్టర్లు, డీపీవో ఆధ్వర్యంలో జరగాల్సిన పనులపై అధికారులకు మార్గదర్శకం చేశారు. దేశంలోనే అభివృద్ధి చెందిన పల్లెలు తెలంగాణలో ఉండాలని అన్నారు. అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, స్పష్టమైన విధానాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలన్నీ బాగుపడి తీరాలని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాకుంటే, ఇంకెప్పుడు గ్రామాలు బాగుపడుతాయని అన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధితో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పనులు చేసుకోవడానికి నరేగా పథకాన్నివ్యూహాత్మకంగా వినియోగించుకోవాలన్నారు. ఈఏడాది రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిగ్రామం ప్రతిరోజు శుభ్రం కావాల్సిందేనని, అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరోటి లేదని స్పష్టంచేశారు. రాబోయే 2నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, 4నెలల్లో రైతువేదికల నిర్మాణం పూర్తికావాలన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏ పని చేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని, దానికి అనుగుణంగానే పనులు చేయాలని, ఈ వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయాలన్నారు. సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.