తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..?

by Shyam |   ( Updated:2021-08-15 00:43:29.0  )
independence day celebrations
X

దిశ, తెలంగాణ బ్యూరో : గోల్కొండ కోటలో పతాకావిష్కరణ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్​ ప్రసంగించారు. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం పునర్​వ్యవస్థీకరించామని సీఎం కేసీఆర్​ ఉద్ఘాటించారు. పరిపాలన ప్రజలకు చేరువైందన్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు రావడం లేదని, కొత్త జిల్లాలు, రెవెన్యూ మండలాలు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు చేశామన్నారు. దీనికి అనుగుణంగా సమీకృత కలెక్టరేట్లు ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్​ వెల్లడించారు.

పల్లె, పట్టణ ప్రగతితో అద్భుత ప్రగతి సాధిస్తున్నామన్న కేసీఆర్ పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత కొలువైందని, పరిశుభ్రతతోనే పరమాత్ముడు కొలువై ఉంటాడని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మరణించిన వారికి సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు వైకుంఠధామాలు ఏర్పాటు చేశామని, పచ్చదనం కోసం హరితహారం కింద ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్​, నీటి ట్యాంకులు కలిగి ఉంది మన రాష్ట్రంలోనేనన్నారు. రాష్ట్రం పచ్చని చెట్లు, పరిశుభ్రతతో ఆహ్లాదంగా రూపుదిద్దుకుంటున్నట్లు సీఎం కేసీఆర్​ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed