చేతులెత్తేసిన కేసీఆర్..

by Shyam |   ( Updated:2021-03-17 05:38:57.0  )
చేతులెత్తేసిన కేసీఆర్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంధన చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ చార్జీలను కంట్రోల్ చేయడం తమ చేతుల్లో లేదని అసెంబ్లీ సాక్షిగా తెగేసి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కసారి మాత్రమే టాక్స్ పెంచామని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేశారు.

ఇదిలాఉండగా, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన చార్జీలు పెంచినట్లు అటు కేంద్రం చెబుతోంది. అయితే, వరుస చార్జీల పెంపుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక సందర్భంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాజస్థాన్ ప్రభుత్వం టాక్స్‌లను తగ్గించిన విషయం తెలిసిందే. ఇటు రానున్న తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేను గెలిపిస్తే లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4 తగ్గిస్తానని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో ఇంధనంపై చార్జీలను తగ్గించినపుడు తెలంగాణలో ఎందుకు సాధ్యపడదని మధ్య తరగతి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

వామన్ రావు హత్యపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story