- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వీఆర్వోల సర్దుబాటుకు సీఎం హామీ
దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖలో పదోన్నతులను, బదిలీలను చేపడుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వచ్చినప్పుడు సంఘం నాయకులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆ సమయంలో వీఆర్వోలను సర్దుబాటు చేస్తామని, వీఆర్ఏలకు పే స్కేలు త్వరలోనే వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సిద్ధిపేట జిల్లాలో అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం కోసం కావల్సిన నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ కు సూచించారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డితో పాటు సెంట్రల్ కార్యవర్గ సభ్యులు, తహశీల్దార్లు అన్వర్, యాదగిరి రెడ్డి, శ్రీనివాసరావు, రెహమాన్, విజయ సాగర్, రామేశ్వర్, రాజేశంలు ఉన్నారు.