సీఎం కేసీఆర్ దేశ చరిత్రలోనే గొప్ప నాయకుడు: ఎమ్మెల్యే చల్లా

by Shyam |   ( Updated:2021-08-06 05:01:58.0  )
సీఎం కేసీఆర్ దేశ చరిత్రలోనే గొప్ప నాయకుడు: ఎమ్మెల్యే చల్లా
X

దిశ, కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల, కానిపర్తిలతో పాటు దేశరాజుపల్లి గ్రామాలలో శుక్రవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. దళిత ఆత్మీయ సమ్మేళనంకు విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు మంగళ హారతులతో, బోనాలతో, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయుడు డా .అంబేద్కర్ కన్న కలలు నెరవేర్చడానికే గొప్ప అద్భుతమైన ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకంకు శ్రీకారం చుట్టారన్నారు. దళితుల ఆర్థిక స్థితిగతులను మార్చే ఈ పథకం ద్వారా సీఎం కేసీఆర్ దేశ చరిత్రలోనే గొప్ప నాయకుడిగా మిగిలిపోతారన్నారు.

దళిత బంధు పథకం అమలైతే ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కోల్పోతారని రాజకీయ లబ్ధి కోసం దళిత బంధు పథకం పై దుష్ప్రచారాలు చేస్తూ పథకం నిలిపివేయాలని కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. గత పాలకులు దళితులను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే భావించారని, దళితుల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికి స్ఫూర్తి అని కొనియాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు దళిత బంధు పథకమును ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా దళిత బంధు పథకం ఆగదని ధీమా వ్యక్తం చేశారు. అంబాల గ్రామంలో 30 లక్షలతో ముస్లిం కులస్తుల ఖబరస్తాన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ పెరియాల రవీందర్ రావు తో పాటు టీఆర్ఎస్ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణ రావు, ప్రదీప్ రెడ్డి, మారేపల్లి నవీన్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story