సీఎం నివాస గృహ వివరాల నమోదు

by Anukaran |   ( Updated:2020-10-10 07:18:31.0  )
సీఎం నివాస గృహ వివరాల నమోదు
X

దిశ ప్రతినిధి, మెదక్:
ఎన్‌లిస్ట్ మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్‌లో భాగంగా మర్కుక్ మండలం ఎర్రవెల్లి‌లోని తన ఇంటికి వచ్చిన పంచాయతీ రాజ్ అధికారులకు తన నివాస గృహ వివరాలను సీఎం కేసీఆర్ స్వయంగా అందించారు. సీఎం కేసీఆర్‌ను ఎర్రవెల్లి గ్రామ కార్యదర్శి పి . సిద్దేశ్వర్ కలిసి వారి నివాస గృహానికి చెందిన వివరాలను టీఎస్ఎన్‌పి‌బీ యాప్‌లో నమోదు చేశారు.

ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….ఆస్తులపై ప్రజలకు హక్కు, వాటికి భద్రత కల్పించేందుకు ప్రతి కుటుంబ స్థిరాస్తుల వివరాలను నమోదుచేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ భూముల తరహాలోనే వ్యవసాయేతర ఆస్తులకూ పట్టాదారు. పాసు పుస్తకాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన వెల్లడించారు. తమ స్థిరాస్తుల వివరాలను గ్రామీణ, పుర ప్రజలు నమోదు చేసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed