- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది తొలి అడుగు మాత్రమే : సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసన సభలో కొత్త రెవెన్యూ చట్టంపై శుక్రవారం సుదీర్ఘంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టం అనేది అంతంకాదని… ఆరంభం మాత్రమేనని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రెవెన్యూ సంస్కరణలో ఇది తొలి అడుగు మాత్రమేనన్నారు. పాత రెవెన్యూ చట్టంలో కేవలం ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలను మాత్రమే తొలగించి, కొత్త చట్టం రూపొందిస్తామని స్పష్టం చేశారు. దీనిపై సభ్యుల సలహాలు స్వీకరిస్తామని సీఎం అన్నారు.
‘రాష్ట్రంలో ప్రస్తుతం 87 రెవెన్యూ చట్టాలు అమలులో ఉన్నాయి. ధరణి ఒక్కటే కాదు. మిగిలిన చట్టాలు కూడా ఉంటాయి. పాలకులు ప్రేక్షకపాత్ర షోషించడం నేరమవుతుంది. గ్రామాల్లో ఎవరి జీవితంవారే సాగిస్తున్నారు. ప్రతిచోట లిటిటేషన్లే ఉంటాయని అనుకోవడం సరికాదు. కోటీ 45 లక్షల 58 వేల మంది రైతులకు రైతుబంధు అమలు అయ్యింది. 57.95 లక్షల మంది రైతులకు రూ.7,279 కోట్లను అందించాం’ అని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు. ‘రైతు బంధు పథకం పరిశీలిస్తే వివాదాల్లో ఉన్న భూములు చాలా తక్కువ. మార్పును అంత సులభంగా ఎవరూ అంగీకరించరు. సమగ్ర సర్వేనే అన్ని సమస్యలకు పరిష్కారం. మార్పును అంగీకరించకపోవడం మానవనైజం. గతంలో భూపంపిణీ శాస్త్రీయంగా జరగలేదు. స్థలాలు.. హద్దులు చూపకుండానే పట్టాలు పంపిణీ చేశారని సీఎం స్పష్టం చేశారు.