నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

by Shyam |
నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
X

దిశ, న్యూస్‌బ్యూరో:
కరోనా నేపథ్యంలో తెలంగాణ అవతరణ వేడుకలను ఈసారి నిరాడంబరంగా జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడం, అనంతరం జాతీయ పతాకావిష్కరణ మాత్రమే నిర్వహించాలని, ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని స్పష్టం చేశారు.ఇందులో భాగంగానే సీఎం ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి, అనంతరం ప్రగతిభవన్‌లో పతాకావిష్కరణ చేస్తారు. మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ తమ కార్యాలయాల్లోనే జాతీయ పతాకావిష్కరణ జరుపుతారని సమాచారం.అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తొలుత అమరవీరులకు నివాళి అర్పించి, అనంతరం పతాకావిష్కరణ చేయనున్నారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన అధికారులతో చిన్నపాటి ‘ఎట్ హోమ్’ ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed