- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి ఇంద్రకరణ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్.. కీలక ఆదేశాలు!
దిశప్రతినిధి, ఆదిలాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, బైంసా ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఫోన్ చేశారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. మరో 24 గంటల పాటు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడటమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలన్నారు. సహాయక చర్యలు చేపట్టడానికి నిర్మల్‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నట్లు తెలిపారు.