కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. ఎన్నికల వేళ టీచర్లకు కీలక బాధ్యతలు

by Sridhar Babu |   ( Updated:2021-08-14 08:33:22.0  )
cm-kcr
X

దిశ, గోదావరిఖని : దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ హుజురాబాద్‌కు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఏకంగా ప్రభుత్వ టీచర్స్‌కి జనసమీకరణ చేయాలని కరీంనగర్ జిల్లా విద్యాధికారికి కేసీఆర్ ఆదేశించారు. టీచర్స్ జనాన్ని సమీకరించి కేసీఆర్ పాల్గొంటున్న మీటింగ్ విజయవంతం చేయాలని వారిని కోరడం విడ్డురంగా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులను టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా, కార్యకర్తల మాదిరిగా వారికి జనసమీకరణ చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. చరిత్రలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఈ ఘనత దక్కుతుందని సదానందం విమర్శించారు. ఇది దొరల పాలనకు అద్దం పడుతోందని ఆరోపించారు. మొన్న కేటీఆర్ మీటింగ్‌కి అంగన్‌వాడీ టీచర్స్, ఆయాలు ఆయన వెళ్ళేమార్గంలో మొక్కలతో దండం పెడుతూ కొన్ని గంటలపాటు నిలబెట్టడం.. ఆనాటి రజాకార్ల పాలనను.. నేడు మన పాలకులు మనకు తెలంగాణలో గుర్తు చేస్తున్నారని అన్నారు.

అందుకు మనం సిగ్గుపడాలని.. ఇవి ఇలాగే కనుక కొనసాగితే సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed