- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మత్స్యకారులకు సీఎం కేసీఆర్ మరో గుడ్ న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో: చేపలు పట్టేందుకు లైసెన్స్ పొందిన మత్స్యకారులకు వేట సామగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,800 మంది లైసెన్స్‌డ్ వేటగాళ్లలను అధికారులు గుర్తించారు. వీరందరికి కావల్సిన వలలు, మోపెడ్‌లు, పవర్ బోట్‌లను సబ్సిడీ ద్వారా కేటాయిస్తారు. మత్స్యశాఖ అధికారులు జిల్లాల వారిగా మత్స్యకారుల అవసరాలను తెలుసుకొని నివేధికలను సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో నివేధికలను ప్రభుత్వానికి చేరవేస్తారు.
ఇందుకు సంబంధించిన గురువారం మాసాబ్ ట్యాంక్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపపిల్ల పంపిణీ కోసం రూ. 712కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెడుతామన్నారు. చెరువులో చేపలు పట్టే విషయంలో జరుగుతున్న ఘర్షణలను అరికట్టేలా తగిన చర్యలు చేపడుతామన్నారు. మత్స్యకారులపై దాడులు చేసిన వారికి చట్టపరమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.