- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి చేసుకోబోతున్న కేసీఆర్ దత్తపుత్రిక
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష త్వరలో పెళ్లీ చేసుకోబోతుంది. హైదరాబాద్ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో ప్రత్యూష నిశ్చితార్థ వేదిక జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రత్యూష నిశ్చితార్థ వేడుకను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య పర్యవేక్షించారు.
కన్నతండ్రి, పినతల్లి వేధింపులతో చావు బ్రతుకుల మధ్య ఆస్పత్రిలో చేరిన ప్రత్యూష అనే అమ్మాయిన సీఎం కేసీఆర్ తన దత్తపుత్రికగా ప్రకటించారు. అనంతరం ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆమె యోగక్షేమాలను చూస్తోంది. ప్రత్యూష నర్సింగ్ కోర్సు పూర్తిచేసి, ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.
రాంనగర్ ప్రాంతానికి చెందిన మమత, మర్‌రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్.. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై ప్రత్యూషను సంప్రదించగా ఆమె అంగీకరించారు. ఈ సమాచారాన్ని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఉన్నతాధికారులకు చేరవేయగా వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమెను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. ప్రత్యూష పెళ్లాడబోయే యువకుడి వివరాలను తెలుసుకున్న కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. నిశ్చితార్థానికి వెళ్లమని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ డి.దివ్యను ఆదేశించారు. తన వివాహానికి వస్తానని సీఎం కేసీఆర్ తనతో చెప్పినట్లు ప్రత్యూష వెల్లడించారు. మంచి కుటుంబంలోకి వెళ్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.