- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఒప్పందం ఉల్లంఘిస్తోందని ప్రధానికి సీఎం జగన్ లేఖ
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జలవివాదంపై ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖలు రాశారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని లేఖల్లో పేర్కొన్నారు. నీటి వినియోగంపై తెలంగాణ తీరును తప్పుబడుతూ లేఖలు రాశారు. విద్యుత్ ఉత్పత్తికి ఏకపక్షంగా నీటిని వినియోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘించిందని సీఎం జగన్ ఆక్షేపించారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం విషయంలో యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. జలాశయంలో కనీస డ్రాయింగ్ లెవల్‌కు నీటి మట్టం చేరుకోకపోయినప్పటికీ పూర్తి సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అంశాన్ని సైతం ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉల్లంఘనలపై కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలను జతపరిచారు.