- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈనెల 29న గొల్లపూడికి సీఎం జగన్..
దిశ, ఏపీ బ్యూరో: జూన్ 29న గొల్లపూడిలో సీఎ వైఎస్ జగన్ పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘దిశ యాప్’ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. దిశ యాప్‌ని ప్రతి మహిళా డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీఎం జగన్ గొల్లపూడి వెళ్లనున్నారు. ఆపదలో ఉన్న యువతులు, మహిళలను కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్ దిశ యాప్‌ను తెరపైకి తీసుకువచ్చారు. పోలీస్ శాఖ రూపొందించిన ఈ యాప్‌ను సీఎం వైఎస్ జగన్ గతేడాది ఫిబ్రవరి 8న ఆవిష్కరించారు. దిశ యాప్ తమ మొబైల్ ఫోన్లో ఉంటే చాలు యువతులు, మహిళలకు ఆపద నుంచి రక్షణ కలిగినట్లేనని సీఎం జగన్ స్పష్టం చేస్తున్నారు. తాము ఆపదలో ఉన్నామని సందేశం ఇస్తే చాలు.. క్షణాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని రక్షిస్తారు. ఏడాది కాలంలో ఈ యాప్ జాతీయ స్థాయిలో గుర్తింపు సైతం పొందింది. ఏడాదిలోనే నాలుగు జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం.