పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో పెట్టొద్దు : జగన్

by Anukaran |   ( Updated:2020-09-08 23:07:59.0  )
పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో పెట్టొద్దు : జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి జాతీయ పత్రికలతో సంభాషించారు. పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో పెట్టకూడదని, అలాచేస్తే ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రాజధాని భూ కుంభకోణం విషయంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే బినామీలంతా బయటపడుతారని సీఎం జగన్ స్పష్టంచేశారు.

రాజధాని కోసం వేల ఎకరాలు.. రూ. లక్షల కోట్లు అవసరం లేదని చెప్పారు. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందన్నారు. అంతేకాకుండా, భారీ నిర్మాణాలకు అమరావతి అనువైన ప్రాంతం కాదని చెప్పారు. ఏపీ క్యాపిటల్ కోసం 33వేల ఎకరాలు అవసరం లేదని.. 500 ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చునని జాతీయ పత్రికలకు ఇచ్చిన ఇంటర్యూలో సీఎం జగన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed