సీఎం జగన్ ఇంట విషాదం..

by Anukaran |
సీఎం జగన్ ఇంట విషాదం..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి వైఎస్‌ భారతి పెద్దనాన్న ఈసీ పెద్ద గంగిరెడ్డి (78) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద గంగిరెడ్డి పులివెందులలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆయన స్వగ్రామం వేముల మండలం గొల్లలగూడూరులోని ఇంటికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో చికిత్స కోసం ఆయనను పులివెందులకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యలోనే తుదిశ్వాస విడిచారు.

దీంతో ఆయన భౌతికకాయాన్ని గొల్లలగూడూరు గ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ వారి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. జగన్ తల్లి వైఎస్‌ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్‌ భారతిరెడ్డిలు వెంటనే గొల్లలగూడూరుకు చేరుకున్నారు. గంగిరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం గ్రామసమీపంలోని సొంత వ్యవసాయ భూమిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Next Story