- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మూలా నక్షత్రం రోజు కావడంతో అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అంతకుముందు ఘాట్ రోడ్డు మార్గంలో ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు పాలకమండలి ఛైర్మన్ పైలా స్వామినాయుడు, ఈవో సురేశ్‌బాబు తదితరులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సీఎం పరిశీలించి ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దుర్గగుడి రక్షణకు రూ.70కోట్లు ప్రకటించారు. సీఎంతో పాటు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్, మల్లాది విష్ణు, జోగి రమేశ్ ఉన్నారు.