- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో అవసరమున్న ప్రతి నియోజకవర్గంలో ఆక్వాహబ్ లను నిర్మిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వాహబ్ లకు వర్చువల్ పద్దితిలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తొలిదశలో జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం హార్బర్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.1510 కోట్లతో 4 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. మరో రూ.10 వేల కోట్లతో 3 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. నాలుగు హార్భర్లకు డిసెంబర్ 15 లోగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
నవరత్నాల్లోని ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మత్స్య పరిశ్రమ రూపు రేఖలను మారుస్తామని అన్నారు. చేపల వేట నిషేధ సమయంలో లక్షా రెండు వేల మంది మత్స్యకారులకు రూ.102 కోట్ల సాయం అందిస్తున్నామని చెప్పారు. ఆక్వా రైతులకు రూ.1.50లకే కరెంటు సరాఫరా చేస్తామని.. దీంతో 55 వేల మంది ఆక్వా రైతులకు లబ్ది పొందనున్నట్లు వెల్లడించారు.