రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయి: సీఎం జగన్  

by srinivas |
YS Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని సీఎం వైఎస్ జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ రూపురేఖలను మార్చేందుకు కొప్పర్తి పారిశ్రామిక వాడ, నెల్లూరు, చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని శ్రీసిటీ వంటివి ఎంతగానో తోడ్పడతాయని వెల్లడించారు. కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్‌ఆర్‌ మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌, వైఎస్ఆర్-జగనన్న ఇండస్ట్రియల్ హబ్, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లను సీఎం జగన్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాయలసీమలో నిరుద్యోగాన్ని రూపుమాపడం లో ఇవి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ హబ్ ద్వారా 7వేల 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. అలాగే జిల్లాలో మరో 18 చిన్న పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. 3,164 ఎకరాల్లో విస్తరించిన మెగా ఇండస్ట్రియల్ పార్క్ కోసం రూ.1,585 కోట్లు ఖర్చు చేశామని.. ఈ మెగా పార్కును ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఉద్యోగులు ఇదే చోట పనిచేస్తారని వెల్లడించారు.

మెగా ఇండస్ట్రియల్ పార్క్ లో రూ.600 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు మరో 18 కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మరో 6 నుంచి 9 నెలల్లో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ ప్రజలకు తెలియజేశారు. రాష్ట్రంలో ఏర్పడిన డిక్సన్‌ సంస్థతో వచ్చే ఏప్రిల్‌ నాటికి పరిశ్రమలో 1,800 మందికి ఉపాధి లభిస్తుందని.. మరోవైపు లక్ట్రానిక్స్‌ రంగంలో పెట్టుబడులకు వీవీడీఎన్‌ సంస్థ సంసిద్ధంగా ఉందని సీఎం వైఎస్ జగన్‌ స్పష్టం చేశారు.

Next Story