జగన్ తొలి ప్రాధాన్యం విద్యే..!

by srinivas |
జగన్ తొలి ప్రాధాన్యం విద్యే..!
X

వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి ప్రాధాన్యం విద్యారంగమే. సరైన విద్య లభించని కారణంగానే సమాజంలో అసమానతలు చోటుచేసుకుంటున్నాయని, అజ్ఞానము, అవిద్యే సమాజం వెనుకబాటుకు, సమాజంలో రుగ్మతలకు కారణమని జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే విద్యారంగాన్ని బలోపేతం చేస్తే సమాజాన్ని సంస్కరించినట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం విద్యారంగమే కావడం విశేషం.

గతంలో ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా విద్యార్థుల అవసరాలు తీర్చి వారి గుండెల్లో కొలువైఉండిపోయారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ జగన్ కూడా విద్యారంగం దశ, దిశ మార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకే మొన్నటికి మొన్న అమ్మఒడిని అమలు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు తల్లులు తాపత్రయపడేలా పథకరచన చేసి ఉత్సాహం నింపారు. నిన్నటికి నిన్న ప్రభుత్వం పాఠశాలలన్నింటినీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టి శభాష్ అనిపించారు. ఇప్పుడు జగనన్న వసతి దీవెనతో విద్యార్థుల్లో మరింత ఆనందాన్ని నింపారు.

అమ్మఒడి ఉద్దేశం పాఠశాలలకు పునర్వైభవం తేవడమైతే.. జగనన్న వసతి దీవెన విద్యార్థులంతా ఎలాంటి ఫీజుల ఒత్తిడి లేకుండా విద్యనభ్యసించడం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో వసతుల మెరుగుకు మరిన్ని నిధులు విడుదల చేసి వచ్చే విద్యాసంవత్సరానికల్లా విద్యను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టారు.

Read also..

విద్యార్థుల్లో ఆనందం పెంచుతున్న జగనన్న వసతి దీవెన

Advertisement

Next Story