- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్‌తో ముగిసిన సీఎం జగన్ భేటీ
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశం ముగిసింది.ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అంశాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే, ఏపీలోని వివిధ యూనివర్సిటీలకు వీసీల నియామకాల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ఫైల్ ప్రభుత్వం నుంచి వచ్చి చాలా కాలమవుతున్నా గవర్నర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడంతో దానిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విషయంలో ఇటీవల కేంద్రంతో జరిపిన చర్చల సారాంశాన్ని సీఎం జగన్ గవర్నర్‌కు వివరించారు. ఈ నెలాఖరున శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తేదీలు, ఏయే బిల్లులు ప్రవేశపెట్టేది తదితర అంశాలపై సీఎం గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కరోనా కంట్రోల్, ఇతర అంశాలపై కూడా చర్చలు సాగినట్లు సమాచారం.