- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు కుట్రతోనే ఇంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు
దిశ, విశాఖపట్నం : పేదలకు లబ్ధిదారుల పేరుతో ఇళ్లపట్టాలిచ్చి, రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నాం. కానీ, ప్రతిపక్షనేత కుట్రతో అది సాధ్యం కాలేదు. త్వరలోనే న్యాయపరమైన చిక్కులు తొలిగిన తరువాత లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తామని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా గుంకలాం గ్రామంలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ పైలాన్‌ను ఆవిష్కరించారు.అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అండ్ కో కుట్రలతో రిజిస్ట్రేషన్‌లు జరగలేదు. లబ్ధిదారులకు కేవలం ‘డి’ పట్టాలు మాత్రమే ఇస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తాం. డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుంది. పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చారు. అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. విశాఖలో 1.84 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించాం..ల్యాండ్ పూలింగ్‌కు సంబంధంలేనివారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు.
రాజమండ్రిలో ఆవా భూముల పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా 30 రకాల వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు.. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధ హక్కుగా మార్చారు. పేదలకు ఆస్తి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారు. విజయనగరంలో మెడికల్ కాలేజీకి జనవరిలో టెండర్లు.. మార్చి నాటికి మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడతాం. రెండేళ్లలో తోటపల్లి, తారకరామ తీర్ధసాగరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ఏడాదిలోగా రాముడువలస లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తామన్నారు.
అక్క, చెల్లమ్మలకు సేవ చేసే అవకాశం దక్కింది..
‘‘అక్కచెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దక్కిందని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మహిళలకు, రైతులకు, విద్యార్ధులకు.. అక్కచెల్లెమ్మలకు, వందల సామాజిక వర్గాలకు అండగా నిలిచా. 50 లక్షలకు పైగా రైతులకు రైతు భరోసా సాయం అందించాం. 62 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్.. వారి ఇంటి వద్దకే అందించేలా గొప్ప కార్యక్రమం చేపట్టాం. 15 లక్షలకు పైగా విద్యార్ధుల చదువులకు తోడుగా నిలబడ్డా. రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించి అండగా నిలబడ్డా. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం’’ అని అన్నారు.‘‘అక్కచెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దక్కింది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మహిళలకు, రైతులకు, విద్యార్ధులకు.. అక్కచెల్లెమ్మలకు, వందల సామాజిక వర్గాలకు అండగా నిలిచా. 50 లక్షలకు పైగా రైతులకు రైతు భరోసా సాయం అందించాం. 62 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్.. వారి ఇంటి వద్దకే అందించేలా గొప్ప కార్యక్రమం చేపట్టాం.
15 లక్షలకు పైగా విద్యార్ధుల చదువులకు తోడుగా నిలబడ్డా. రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించి అండగా నిలబడ్డా. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం’’ అని అన్నారు.300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నాం. టిడ్కో ఇళ్లను పూర్తిచేసేందుకు రూ.9వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. లక్షా 43వేల మంది టిడ్కో లబ్ధిదారుల్లో ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో.. 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల రూ.4,250 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చాం. మొదటి ఆప్షన్‌లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను లబ్ధిదారులకు ఇస్తాం. రెండో ఆప్షన్‌లో నిర్మాణ ఖర్చులను పురోగతి వారీగా డబ్బులు చెల్లిస్తాం. మూడో ఆప్షన్‌లో పూర్తిగా ఇంటి నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి,మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హరిజవహర్‌లాల్,ఇతర అధికారులు పాల్గొన్నారు.
పట్టాల పంపిణీలో అపశృతి..
గుంకలాంలో బుధవారం నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ లో అపశృతి చోటుచేసుకుంది. ఇంటి పట్టాను అందుకోవడానికి వచ్చిన లబ్ధిదారుడు ఎం.సత్తిబాబు ఎండ దెబ్బ గట్టిగా తగిలి అస్వస్థతతో మృతి చెందాడు. వెంటనే ఆ వ్యక్తిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై అధికారులు పూర్తిస్ధాయిలో విచారణ చేపడుతున్నారు.