- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ(కరువు భత్యం) పెంపుపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత పేర్కొన్నారు. గురువారం టీజీవో నేతలు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో భేటి అయ్యారు. ఈ నేపథ్యంలో జోనల్ వ్యవస్థ, ఉద్యోగ ఖాళీల భర్తీ, తదితర అంశాలపై చర్చించారు. టీజీవో నేతల విజ్ఞప్తి మేరకు పెండింగ్ లో ఉన్న డీఏని అతి త్వరలో విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.
అంతేకాకుండా జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగులను సర్ధుబాటు చేస్తామని, ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపినట్లు వివరించారు. సీఎం ను కలిసినవారిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సహాధ్యక్షులు సహదేవ్, హైదరాబాద్ నగర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కేంద్ర కార్యదర్శి వెంకటయ్య, లక్ష్మణ్ లు పాల్గొన్నారు.