- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవరికి వారే యమునా తీరే.. ‘బొమ్మైకి’ బొమ్మ చూపిస్తున్న మంత్రులు
దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులైన గడువక ముందే అసమ్మతి సెగ మళ్లీ రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశాక.. జులై 28 కన్నడ పీఠాన్ని బసవరాజ బొమ్మై అధిష్టించిన విషయం తెలిసిందే. అయితే, తన మార్క్ పాలన ప్రారంభించక ముందే ఆయనకు సొంత పార్టీలోనే అసమ్మతి కుంపట్లు సెగలు పుట్టిస్తున్నాయి. కోరిన శాఖలు కేటాయించలేదని మంత్రులు అలకబూనినట్టు తెలుస్తోంది.
అసంతృప్తికి గురైన వారిలో ఎంటీబీ నాగరాజ్, ఆనంద్ సింగ్ ఉన్నట్టు సమాచారం. అయితే, శాఖల కేటాయింపుల్లో తన స్థాయిని బీజేపీ దిగజార్చిందని నాగరాజ్ ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. ప్రస్తుతం పర్యాటక మంత్రిగా కొనసాగుతున్న ఆనంద్ ఏకంగా పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో వారిని బుజ్జగించలేక ముఖ్యమంత్రి బొమ్మై తల పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ పంచాయితీని బొమ్మై అధిష్టానం ముందుకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ అసమ్మతి రాగాలతో కన్నడ రాజకీయాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.