- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చట్టాలతో రైతులకు ఒరిగేదేమీ లేదు : భట్టి
దిశ, మధిర: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఒరిగేది ఏమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురంలో ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని పంట పొలాల్లో రైతుల వద్దకు వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లచ్చగూడెం గ్రామంలో మూడు సంవత్సరాల క్రితం నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత చింతకాని మాజీ ఉప సర్పంచ్, సీపీఐఎ(ఎం) సీనియర్ నాయకులు గడ్డం ఆదినారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు జావిద్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి దానియేలు తదితరులు పాల్గొన్నారు.