చాకచక్యంగా చైన్ స్నాచింగ్.. దొరకడం ఖాయమన్న పోలీసులు..

by Sumithra |   ( Updated:2021-07-13 09:47:34.0  )
చాకచక్యంగా చైన్ స్నాచింగ్.. దొరకడం ఖాయమన్న పోలీసులు..
X

దిశ, మక్తల్ : మక్తల్ పట్టణంలోని నిఘా నేత్రాలకు చిక్కకుండా గుర్తు తెలియని వ్యక్తులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. మక్తల్ పట్టణంలో పలుమార్లు గొలుసు దొంగతనాలు జరగడంతో మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వచ్చినా మెడ పై పైటకొంగు నిండుగా కప్పుకొని జంటలుగా వచ్చివెళ్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపులు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఐదు సార్లు గొలుసు దొంగతనాలు నిఘా నేత్రాలు లేని స్థలంలో జరిగినవే. రెండు రోజుల క్రింద జరిగిన సంఘటన ఓ పాఠశాల సీసీ కెమెరాల్లో నమోదు అయ్యింది. జరిగిన సంఘటనను పరిశీలిస్తే ఈప్రాంతం గురించి తెలిసిన వారే సీసీ కెమెరాలను గమనిస్తూ చాకచక్యంగా నేరం చేసి తప్పించుకుంటున్నారని, వారిని ఎట్టిపరిస్థితుల్లో పట్టుకుంటామన్నారు పోలీసులు.

Advertisement

Next Story