బిగ్ బ్రేకింగ్ : 50 వేల ఉద్యోగాలకు లైన్ క్లియర్.. జీవో జారీ

by Harish |   ( Updated:2021-06-30 08:59:29.0  )
50 thousand jobs
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి క్లియరెన్స్​ వచ్చినట్లైంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్​ రావడమే మిగిలింది. రాష్ట్రపతి సవరణ ఉత్తర్వుల ప్రకారం జోనల్​ జీవోను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది.

మల్టీ జోన్​ –1 పరిధిలో తొలి జోన్​ కాళేశ్వరం జోన్‌లో కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఉన్నాయి. అదే విధంగా రెండో జోన్​ బాసర జోన్‌లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్​ జగిత్యాల జిల్లాలు, మూడో జోన్​ రాజన్న సిరిసిల్లలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు, నాల్గో జోన్ ​భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలున్నాయి.

ఇక మల్టీజోన్​ –2లో ఐదో జోన్​ యాదాద్రిలో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలు, ఆరోజోన్ చార్మినార్‌లో మేడ్చల్​ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలు, ఏడో జోన్ జోగుళాంబలో మహబూబ్​నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్​ కర్నూల్​ జిల్లాలున్నాయి.

అదే విధంగా పోలీస్ ​డిపార్ట్​మెంట్​ పరిధిలో మల్టీజోన్​ –1లో తొలి కాళేశ్వరం జోన్‌లో జయశంకర్​ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, రామగుండం పోలీస్​ కమిషనరేట్, ములుగు జిల్లాలు, రెండో జోన్​బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్, జగిత్యాల జిల్లాలు, మూడో జోన్​ రాజన్నలో కరీంనగర్​ పోలీస్​ కమిషనరేట్, సిద్దిపేట పోలీస్​ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్​ జిల్లాలు, నాల్గో జోన్​ భద్రాద్రిలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పోలీస్​ కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్​ పోలీస్ కమిషనరేట్ ​ఉంది.

మల్టీజోన్​–2లో ఐదో జోన్​ యాదాద్రిలో సూర్యాపేట, నల్గొండ, రాచకొండ పోలీస్​ కమిషనరేట్, ఆరో జోన్​చార్మినార్‌లో హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట్, సైబరాబాద్ ​పోలీస్ కమిషనరేట్, సంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలు, ఏడో జోన్​ జోగుళాంబలో మహబూబ్​నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్​ కర్నూల్​ జిల్లాలున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్‌ల సవరణపై సీఎస్ సోమేశ్​ కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

జీవో కాపీ కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి

2021GAD_MS129

Advertisement

Next Story

Most Viewed