- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సర్కార్ ఆదేశాలు బేఖాతరు.. సెలవుల్లో కొనసాగుతున్న క్లాసులు
by Sridhar Babu |

X
దిశ, రామగిరి : తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు సెలవులను అమలు చేయకుండా తరగతులను కొనసాగిస్తున్నారు. విద్యాశాఖ ఈ నెల 6 నుండి 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం విధితమే.
కానీ, నిబంధనలకు విరుద్ధంగా సెంటినరీకాలనీలోని వాణీ సెకండరీ పాఠశాల యాజమాన్యం యథావిధిగా తరగతులను నిర్వహిస్తున్నారు. తరగతులు, పరీక్షల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సెలవుల్లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవన్న విద్యాశాఖ అధికారులు.. ఇక్కడ మూడు రోజులుగా తరగతులు నడుస్తున్నా పాఠశాలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తరగతులను నిర్వహించరాదు.. సంపత్ రావ్, ఎంఈవో
దసరా సెలవుల్లో పాఠశాల యాజమాన్యాలు తరగతులను నిర్వహించరాదు. ఎవరైనా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story