టీఆర్ఎస్ పార్టీలో వార్.. రెండు వర్గాలుగా చీలిక

by Shyam |
టీఆర్ఎస్ పార్టీలో వార్.. రెండు వర్గాలుగా చీలిక
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ప్రతినిధుల పంచాయితీ రోడ్డెక్కింది. ఈ పంచాయితీ ప్రధానంగా అధికార పార్టీ నేతల మధ్య జరుగుతుండటం విశేషం. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ టీఆర్ఎస్ వాళ్లే. అయినప్పటికీ వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో కార్పొరేటర్లు రెండు వర్గాలు గా చీలియారు. మొత్తం 22 మందిలో 16 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్ ఆషియియో మెంబర్లు కలిపి మొత్తం 18 మంది అధికార పార్టీకి చెందిన వారు ఉన్నారు. మేయర్ వైపు ఇద్దరు కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఉన్నారు. డిప్యూటీ మేయర్ వైపు 14 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల కలెక్టర్‌కు డిప్యూటీ మేయర్ వర్గం ఫిర్యాదు చేసింది. అందుకు కౌంటర్‌గా మేయర్ ప్రెస్ మీట్ పెట్టి డిప్యూటీ మేయర్‌పై సవాల్ విసిరారు. ఈ విధంగా రెండు వర్గాలు నువ్వా..నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుతున్నారు. పార్టీ నిబంధనలను కూడా లెక్క చేయకుండా ఆరోపణలు చేసుకుంటున్నారు.

సామాజిక వర్గాలుగా చీలిక…?

బండ్లగూడ జాగీర్ ను గ్రామపంచాయతీ నుంచి ప్రభుత్వం కార్పొరేషన్ గా మార్చింది. ఈ క్రమంలో టీఆర్ ఎస్ ను ప్రజలు ఆశీర్వదించి అత్యధిక స్థానాలను కట్టబెట్టారు. అయితే మేయర్ స్థానం బీసీ జనరల్ కావడంతో మహేంద ర్ గౌడ్ ను ఎన్నుకున్నారు. పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి మేయర్ కార్పొరేటర్లను పట్టించుకోకుండా నియం త ధోరణి అవలంబిస్తున్నారని డిప్యూటీ మేయర్ ఆరోపణ లు చేస్తున్నారు. తమను సంప్రదించకుండానే తీర్మానాలు చేస్తున్నారని మండి పడుతున్నారు. పైరవీలకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో డిప్యూ టీ మేయర్ కు మిగిలిన కార్పొరేటర్లతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు మద్దతు పలికారు. దీంతో సామాజిక వర్గాలు గా చీలిపోయాయని ప్రచారం సాగు తుంది. మేయర్ వర్గానికి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మద్దతుండగా, డిప్యూటీ మేయర్ వర్గానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మద్దతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మేయర్‌ను దించడం కోసమేనా..?

స్థానిక ఎమ్మెల్యే అండ దండలతోనే మేయర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని డిప్యూటీ మేయర్ ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే మద్దతు లేకపోతే పార్టీ కార్పొరేటర్లను దూరం చేస్తే ఎందుకు మందలించడం లేదనే ప్రచారం చేస్తున్నారు. మేయర్ అవినీతిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని డిప్యూటీ మేయర్ వర్గం అంటుంది. అదే స్థాయిలో మేయర్ వర్గం స్పందిస్తుంది. పార్టీ అధిష్టానం కల్పించుకొని సమస్యకు ఫుల్ స్టాఫ్ పెడుతుందా లేక కొనసాగిస్తారా చూడాల్సిందే.

చర్చలకు ఎమ్మెల్యే ప్రయత్నాలు..

డిప్యూటి మేయర్ తో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రహాస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అధికార పార్టీలో ఉండి మేయర్ పై ఫిర్యాదులు చేయడం సరికాదని, ఏదైనా సమస్యలుంటే పార్టీ పెద్దలతో మాట్లాడి సర్థుకపోవాలని సూచించినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లు కలిసి మేయర్ కు మద్దతుగా నిలిచి కలిసిపోవాలని చెప్పినట్లు ప్రచారం జరుతుతుంది. ఎమ్మెల్యేకు గౌరవం ఇచ్చి ముందుకు సాగుతారో… లేకపోతే ఇలానే ఫిర్యాదులు చేసుకుంటూ సమయం వృథా చేస్తారో మీ ఇష్టమని డిప్యూటీ మేయర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అంతర్గత చర్చలతో ఏం జరుగుతుందోనని ప్రజలు, పార్టీ కార్యకర్తలు సర్వత్రా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story