- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడే.. సద్దుల బతుకమ్మపై క్లారిటీ..
దిశ, తెలంగాణ బ్యూరో: సద్దుల బతుకమ్మపై క్లారిటీ వచ్చింది. ప్రతి ఏటా దుర్గాష్టమి రోజు చద్దుల బతుకమ్మను నిర్వహించడం ఆనవాయితీ. అదే విధంగా ఈ ఏడాది ఈ నెల 13న దుర్గాష్టమి ఉండటంతో ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటే బతుకమ్మ పండుగ అనేది ప్రాంతీయ సంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో 9 రోజులు, వేములవాడ, కొండపాక ప్రాంతాల్లో 7 రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో 11 రోజులు, 13 రోజులు ఆడటం కూడా సంప్రదాయం. ఈ బతుకమ్మ పండుగను ప్రాంతీయంగా ఆ ప్రాంతంలోని పురోహితులు, పండితులు నిర్ణయించుకోవడం సరైందేనని తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు మాయవరం చంద్రశేఖరశర్మ సిద్దాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని, సెలవు దినంగా ప్రకటించినందున దుర్గాష్టమిరోజే నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. ప్రాంతీయంగా విభిన్న ఆచారం ఉన్నవారు వారివారి ప్రాంతీయ సంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగను జరుపుకోవచ్చని సూచించారు.