- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాల్ దర్వాజలో ధూంధామ్ స్టెప్పులు
X
దిశ, చార్మినార్ : ఆషాడమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా గురువారం లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి సిటీ కాలేజ్ విద్యార్థులు ధూంధామ్ స్టెప్పులతో బోనాలు సమర్పించారు. సిటీ కాలేజ్ విద్యార్థినీ, విద్యార్థులు బ్యాండ్ మేళాలు, నృత్యాలు చేస్తూ పోతరాజుల విన్యాసాల మధ్య సిటీ కాలేజ్ నుంచి ఊరేగింపుగా వయా షాలిబండా మీదుగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు.
అనంతరం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్కె.వెంకటేష్, మాజీ చైర్మన్ మాణిక్ ప్రభు, ప్రధాన కార్యదర్శి మారుతీ యాదవ్, కోశాధికారి జి.అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story