- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైట్ రైట్.. సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ !
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు ఆరునెలల నుంచి సిటీ బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. డిస్ట్రిక్ బస్సులను పరిమిత సంఖ్యలో నడుపుతున్నప్పటికీ సిటీ బస్సులు మాత్రం ఇంకా రోడ్డెక్కలేదు. ఇదేక్రమంలో మెట్రో సర్వీసులు కూడా ప్రారంభమైన తరుణంలో సిటీ బస్సులను తిప్పాలని సామాన్యుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా సిటీ బస్సులపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఒకట్రెండు రోజుల్లోనే ఉన్నతాధికారులు సమావేశమై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారంరోజుల క్రితం ఏపీ, తెలంగాణకు చెందిన ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల్లో బస్సు సర్వీసులపై చర్చలు జరిపినా ఫలప్రదం కాలేదు. అయితే ఏపీలో విశాఖ, విజయవాడలో ఇప్పటికే సిటీ బస్సులు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణలో కూడా సిటీ బస్సులు ప్రారంభించాలని, ఇదే విషయంపై ఆర్టీసీ యాజమాన్యం కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈనెల చివరి వరకు లేదా వచ్చేనెల తొలివారంలో బస్సులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.