- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెజార్టీ ఉందనే.. బీజేపీ కుట్ర
దిశ, మెదక్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు తెలిపారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్‌లో సీఐటీయూ మెదక్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చుక్కా రాములు పాల్గొని మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా చేపట్టబోయే సమ్మె విజయవంతానికి వివిధ రంగాల స్థాయిలో ఆయా కార్మిక సంఘాలతో కలిసి సదస్సులు నిర్వహించాలని సీఐటీయూ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల పార్లమెంట్‌లో మూడు రైతు వ్యతిరేక బిల్లులు, లేబర్ కోడ్స్‌ను ఆమోదించుకున్నారని, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి మెజార్టీ ఉందనే బీజేపీ కుట్రలు పన్నిందని ఆయన విమర్శించారు.
'
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వాగతించారన్నారు. ఎయిర్ ఇండియా, ఎల్ఐసీ, రైల్వే, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేసేందుకు మోడీ సర్కార్ తన చర్యలను వేగవంతం చేసిందన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరిశ్రమల్లో కార్మికులను తొలగించకూడదని, లాక్‌డౌన్ కాలానికి వేతనాలు తగ్గించకూడదని, తగ్గించిన వాటిని వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తూ అందరికీ పెన్షన్ ఇవ్వాలని చుక్కా రాములు డిమాండ్ చేశారు.