Ashika Ranganathan: వైన్ తాగుతూ చిల్ అవుతున్న యంగ్ హీరోయిన్... ఫొటోలు వైరల్

by sudharani |   ( Updated:2025-01-18 16:01:34.0  )
Ashika Ranganathan: వైన్ తాగుతూ చిల్ అవుతున్న యంగ్ హీరోయిన్... ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganathan) ‘అమిగోస్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన ఈ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించగా.. 2023 వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మొదటి సినిమాతోనే నటనలో మంచి మార్కులు అందుకున్న ఈ బ్యూటీ.. తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల సిద్ధార్థ్ ‘మిస్ యూ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

వాటిలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘విశ్వంభర’ ఒకటి. ఇక సినిమా విషయాలు పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ఆషిక.. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటోంది. ఇందులో భాగంగా.. తాజాగా వెకేషన్‌ (Vacation)కు చెక్కేసిన ఈ బ్యూటీ 17 ఫొటోలను షేర్ చేస్తూ.. ఒక్కో ఫొటోకి ఒక్కో క్యాప్షన్ ఇచ్చింది. వాటిలో 10 ఫొటోకు ‘మదీరా వైన్ టేస్ట్ చేస్తు్న్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. రకరకాలు రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.

Read More..

Madhavilatha: ‘చాలా కష్టంగా ఉంది.. అయినా అనుభవించక తప్పడం లేదు’.. నటి మాధవీలత భావోద్వేగ పోస్ట్

Next Story

Most Viewed