Hero Vishal: ఆ పార్టీ లో అదిరిపోయే స్టెప్పులేసిన హీరో విశాల్ .. వైరల్ అవుతున్న వీడియో

by Prasanna |   ( Updated:2025-01-20 04:57:17.0  )
Hero Vishal: ఆ పార్టీ లో అదిరిపోయే స్టెప్పులేసిన హీరో విశాల్ .. వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొద్దీ రోజుల నుంచి హీరో విశాల్ ( Hero Vishal ) వార్తల్లో నిలుస్తున్నాడు. " మదగదరాజా" ప్రమోషన్స్‌ సమయంలో అనారోగ్యంతో కనిపించడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. స్టేజీపై రెండు నిముషాలు కూడా నిలబడలేకపోయారు, చేతిలో మైక్ పట్టుకున్నప్పుడు వణకడం చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఎన్నడు లేనిది విశాల్‌ ఏంటి ఇంత బలహీనమయ్యారు? ఏమైందని అభిమానులు ఆరాలు తీశారు.

ఈ విషయంపై విశాల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. విశాల్‌కు హై ఫీవర్ తో బాధ పడుతున్నాడని, డాక్టర్స్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పినప్పటికీ, మూవీ ప్రమోషన్స్‌ కోసం ఆయన హాజరయ్యారని పేర్కొన్నారు. ఆ తర్వాత విశాల్ తన ఆరోగ్యంపై స్పందిస్తూ.. " నేను బాగానే ఉన్నాను. నా కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ కు ధైర్యం " చెప్పాడు.

ఇక 'మదగదరాజా' మూవీ పెద్ద విజయం సాధించడంతో టీం మొత్తం సంతోషంలో మునిగిపోయి ఎంజాయ్ చేస్తున్నారు . 12 ఏళ్ల తర్వాత విశాల్ పాత మూవీ రిలీజ్ అయి హిట్ కావడంతో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. సక్సెస్ పార్టీకి అటెండ్ అయిన విశాల్.. అక్కడ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్స్ ..మొత్తానికి విశాల్ కం బ్యాక్ ఇచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story