- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vijay Antony: విజయ్ ఆంటోని ‘VA-25’ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే? (ట్వీట్)

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని(Vijay Antony) అందరికీ సుపరిచితమే. ఆయన ఎన్నో తమిళ చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్‌తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఏడాదిలో ఒక సినిమా అయినా చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక 2016లో విజయ్ ఆంటోని నటించి ‘బిచ్చగాడు’(Bichagadu) బ్లాక్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో దీనికి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు-2’(Bichagadu-2)ను చేశారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక గత ఏడాది హిట్లర్, లవ్ గురు(Love Guru) తో పాటు తమిళంలో ఓ మూవీ చేశారు. అయితే ‘లవ్‌గురు’ సినిమాలో మృణాళిని రవి(Mrinalini Ravi) హీరోయిన్‌గా నటించగా.. ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మించింది. వినాయక్ వైద్యనాథన్(Vinayak Vaidyanathan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయ్ ఆంటోని, అరుణ్ ప్రభు(Arun Prabhu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ‘VA-25’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని(Meera Vijay Antony) నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘VA-25’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమాకు ‘పరాశక్తి’(Parashakti) అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే విజయ్ ఆంటోని పోస్టర్‌ను నెట్టింట పెట్టారు. ఇందులో ఆయన గుడి గన్ పట్టుకుని విభూది పెట్టుకుని కోపంగా చూస్తున్నారు.. వెనకాల రెండు టెంపుల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక చిత్రబృందం ‘పరాశక్తి’ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సమ్మర్‌లో విడుదల కానున్నట్లు వెల్లడించారు. కాగా, విజయ్ ఆంటోని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాటలు పాడటంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తూ ఫుల్ బిజీ బిజీ లైఫ్‌ను కొనసాగిస్తున్నారు.
புயலடிக்கிற வேகத்தில் புழுதி குப்பைங்க இருக்குமா🔥
— vijayantony (@vijayantony) January 29, 2025
இவன் நடக்குற வேகத்த சகுனிக்கூட்டம் தாங்குமா👺#VA25 @ArunPrabu_ @vijayantonyfilm pic.twitter.com/XCxjv95UVH