Vicky Kaushal: ఆ వివాదంపై స్పందించిన స్టార్ హీరో.. అది కథకు ముఖ్యం కాదంటూ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
Vicky Kaushal: ఆ వివాదంపై స్పందించిన స్టార్ హీరో.. అది కథకు ముఖ్యం కాదంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మిస్తున్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం ప్రమోషన్ల బిజీలో ఉంది మూవీ టీమ్. ఇందులో భాగంగా రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) పాత్రకు సంబంధించిన డ్యాన్స్ సీక్వెన్స్ వివాదాస్పదంగా మారడంతో డైరెక్టర్ దాన్ని చిత్రం నుంచి తొలగిస్తామని వెల్లడించారు. అయితే తాజాగా ఈ వివాదంపై స్టార్ హీరో విక్కీ కౌశల్ స్పందించారు. ‘శివ గర్జన(ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యం గురించి నినాదాలు) లేకుండా మేము ఒక్కరోజు కూడా షూటింగ్ చేయలేదు. కథకు సరిపోతుంది కాబట్టి మహారాష్ట్రకు చెందిన లెజిమ్ అనే జానపద నృత్యాన్ని ఈ మూవీలో పెట్టాం.

అది కేవలం 30 సెకన్లు మాత్రమే ఉంది. కథలో భాగం మాత్రమే కాదు.. మన సంస్రృతిని ప్రపంచానికి చూపించే ప్రయత్నం. శంభాజీ మహారాజ్‌ ప్రజల రాజు. ఎవరైనా ఆయనను లెజిమ్ ఆడమని అడిగితే.. రాజు కచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాడు. ఓ సందర్భంలో అనుచరులు రాజును అడిగినప్పుడు ఆయన చిన్న డ్యాన్స్ మూమెంట్ చేస్తాడు. దాన్ని కొందరు తప్పుగా భావించారు కాబట్టి సినిమా నుంచి ఈ సీన్‌ను తొలగించా. అతి కథకు ముఖ్యం కాదు. కథలో భాగమంతే.

అందుకే అభ్యంతరాలు వ్యక్తం కాగానే దాన్ని తొలగించాం. ప్రముఖ రచయిత శివాజీ సావంత్ రాసిన మరాఠీ పుస్తకం ఆధారంగా ఛావా మూవీ రూపొందింది. ఇందులో వాడిన డ్రెసెస్, ఆభరణాలు తయారు చేయడానికి దాదాపు వన్ ఇయర్ పట్టింది. సినిమాలో ఉపయోగించినవన్నీ రెంట్‌కు తీసుకున్నవి కాదు.. స్వయంగా తయారు చేసినవే’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విక్కీ కౌశల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed