అమ్మవారు మా కుటుంబానికి ఇచ్చిన వరం మా ఇంటి మహాలక్ష్మి అంటూ క్లీంకారాతో ఉపాసన స్పెషల్ పోస్ట్

by Kavitha |   ( Updated:2024-08-31 14:15:45.0  )
అమ్మవారు మా కుటుంబానికి ఇచ్చిన వరం మా ఇంటి మహాలక్ష్మి అంటూ క్లీంకారాతో ఉపాసన స్పెషల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గారాల పట్టీ క్లీంకారాతో కలిసి వరలక్ష్మీ వ్రతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పూజకు సంబంధించి క్లీంకారాతో ఉన్న వీడియో, ఫొటోలను ఉపాసన తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఈ మేరకు “అమ్మవారు మా కుటుంబానికి ఇచ్చిన వరం మా ఇంటి మహాలక్ష్మి క్లీంకార. మీరు కోరిన వరాలు సైతం నెరవేరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ క్యాప్షన్ జోడించి మెగా ప్రిన్సెస్‌తో ఉన్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా రామ్ చరణ్, ఉపాసనలకు పెళ్లై 10 ఏళ్లకు క్లీంకార పుట్టింది. అయితే ఇప్పటి వరకు ఈ బాపు బొమ్మ ఫేస్ అయితే రివీల్ చేయలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు క్లీంకారాను చూస్తామా అని క్యూరియాసిటీతో ఉన్నారు.




Advertisement

Next Story

Most Viewed