అన్ని ఇయర్స్ లవ్ అంటూ క్యూట్ వీడియో షేర్ చేసిన ఉపాసన.. శుభాకాంక్షలు తెలుపుతున్న నెటిజన్స్(పోస్ట్)

by Kavitha |
అన్ని ఇయర్స్ లవ్ అంటూ క్యూట్ వీడియో షేర్ చేసిన ఉపాసన.. శుభాకాంక్షలు తెలుపుతున్న నెటిజన్స్(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: కొణిదెల కోడలు, గ్లోబల్ స్టార్ సతీమణి ఉపాసన(Upasana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్‌(Ram Charan)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక మ్యారేజ్ తర్వాత దాదాపు 11 ఏళ్లకు ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ బేబీకి క్లీంకార(Klinkara) అనే నామకరణం కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ మెగా ప్రిన్సెస్ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఎప్పుడెప్పుడు మొహం చూపిస్తారా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రమంలో రీసెంట్‌గా గారాల పట్టి క్లీంకార ఫేస్ కనిపించేసింది.

క్యూట్‌గా అచ్చం రామ్ చరణ్ లాగే ఉంది. అయితే ఉపాసన అపోలో హాస్పిటల్స్‌కి చైర్మెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా మందికి ఫ్రీ ట్రీట్‌మెంట్ కూడా ఇప్పించి గుడ్ హార్ట్ అనిపించుకుంది. అలాగే అనేక రకాల సహాయం చేస్తూ వావ్ అనిపిస్తుంది. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను కూడా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో 40 సంవత్సరాల ప్రేమ & కలయికను జరుపుకుంటున్నాము.. వార్షికోత్సవ శుభాకాంక్షలు, లవ్ యు, అమ్మ & నాన్న.. మేము నిజంగా ఆశీర్వదించబడ్డాము అంటూ రాసుకొస్తూ తన అమ్మా నాన్నకి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపిందే. అదేవిధంతో రామ్ చరణ్, ఉపాసనలు వాళ్లతో స్పెండ్ చేసిన క్యూట్ ఫొటోస్‌ను వీడియోలా చేసి పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story