అల్లు అర్జున్ హీరోయిన్ ఇంట్లో విషాదం.. ఆ బాధ జీవితాంతం ఉంటుందంటూ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
అల్లు అర్జున్ హీరోయిన్ ఇంట్లో విషాదం.. ఆ బాధ జీవితాంతం ఉంటుందంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా(Bhanushree Mehra) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) సరసన ‘వరుడు’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో పూర్తిగా సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టి పలు పోస్టులతో నెట్టింట రచ్చ చేసింది. ఈ క్రమంలోనే ఆమె కరణ్ మానస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా, భానుశ్రీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

ఆమె సోదరుడు నందు అనారోగ్య కారణాలతో చనిపోయాడు. ఈ విషయాన్ని తెలుపుతూ భానుశ్రీ ఓ ఎమోషనల్ పొస్ట్ షేర్ చేసింది. ‘‘నువ్వు చనిపోయి ఏడు రోజులైంది. కానీ ఇంకా నాకు పీడకలలాగే ఉంది. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి? నువ్వు లేకపోవడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రతి చిన్న విషయంలో కూడా నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు లేవనే బాధ.. జీవితాంతం నేను మోయాల్సిందే.

నా మనసులో ఎప్పటికీ నీకు చోటుంటుంది. ఐ లవ్ యూ. నందు ఐ మిస్ యూ(I miss you Nandu). శాంతితో విశ్రాంతి తీసుకోండి నా ప్రియమైన అన్నయ. మీరు ఎల్లప్పుడూ నా హృదయంలో, నా జ్ఞాపకాలలో ఉంటారు. నేను చేసే ప్రతి పనిలో జీవిస్తారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నందు. ఎప్పుడూ చెప్పగలిగే దానికంటే ఎక్కువగా నిన్ను మిస్ అవుతున్నాను’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తన అన్నతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.

Advertisement

Next Story