- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే!
దిశ, సినిమా: ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంతా అందాల ప్రదర్శన విషయంలో తగ్గేదెలా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎక్స్పోజింగ్ ఎంత చేస్తే అంత ఫేమస్ అవుతున్నారు. కానీ ఒకప్పటి స్టార్ హీరోయిన్ సదా మాత్రం స్కిన్ షో చేయకున్నా కానీ స్టార్ హీరోయిన్గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు సయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని వరుస ఆఫర్లు కొట్టేసింది. ఎన్టీఆర్, బాలకృష్ణ, మంచు మనోజ్, అల్లరి నరేష్ వంటి హీరోలతో సినిమాలు చేసింది. అన్నిటిలో పద్ధతిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ గత కొద్ది కాలంగా సదాకు ఆఫర్లు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది. అలా అని ఖాళీగా ఉండకుండా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం డాన్స్ షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తుంది. ఇటీవల సదా అహింసా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక సదా పర్సనల్ లైఫ్ విజయానికొస్తే.. ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదన్న విషయం తెలిసిందే. దీంతో సదా పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె ఓ హీరోను ప్రేమించి ఏవో కారణాల వల్ల బ్రేకప్ చెప్పిందని పుకార్లు షికార్లు చేశాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత తేలిపోయింది.
ఈ క్రమంలో.. తాజాగా, సదా పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడుకు చెందిన ఓ బిజినెస్ మెన్‌ను సదా పెళ్లి చేసుబోతున్నట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో దానికి సదా కూడా ఒప్పుకుందట. దీనిపై తొందరలో అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం సదా పెళ్లి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కానీ సదా ఫ్యాన్స్ మాత్రం ఏదైనా ఉంటే ఆమె ప్రకటిస్తుంది కదా అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు.
- Tags
- Sadha