- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘నేను ఎక్కడున్నానో చెప్పండి చూద్దాం’.. ఎక్స్‌లో టాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు ఆయనొక అద్భుతమైన ఫ్యామిలీ హీరో(Family Hero). ఆయన సినిమా కోసం ఫ్యాన్స్.. ముఖ్యంగా మహిళా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూసే వారు. టీవీల్లో ఆయన సినిమా వస్తే చాలు.. రిమోట్ తీసుకొని ఎవరికీ ఇచ్చేవారు కాదు.. అలాంటి అద్భుతమైన హీరో.. ఇప్పుడు విలన్ గెటప్స్‌లో అదరగొడుతున్నారు. భయంకరమైన గెటప్స్‌తో తనలోని నట విశ్వరూపం చూపిస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. టాలీవుడ్(Tollywood) సీనియర్ హీరో జగపతి బాబు(Jagapathi Babu). కెరీర్ ప్రారంభంలో హీరోగా రాణించిన ఆయన.. ప్రస్తుతం విలన్ గెటప్స్‌తో అదరగొడుతున్నారు.
రామ్ చరణ్(Ram Charan)తో రంగస్థలం, ఎన్టీఆర్‌తో అరవింద సమేత, ప్రభాస్‌తో సలార్, అల్లు అర్జున్‌తో పుష్ప-2, శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తండ్రి, సైరా సినిమాలో చిరంజీవితో పాటు, లెజెండ్‌లో బాలకృష్ణతో చేశారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan), నాగార్జన తప్ప అందరూ సీనియర్ అండ్ స్టార్ హీరోలతో జగపతి బాబు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పుష్ప-3 తో పాటు రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతున్న #RC16(వర్కింగ్ టైటిల్) సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా.. జగపతి బాబు సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. తన చిన్ననాటి ఫొటోను పోస్టు చేసి ‘నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి చూద్దాం’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇది గమనించిన ఫ్యాన్స్, నెటిజన్లు అక్కడున్నావ్.. ఇక్కడున్నావ్.. అంటూ రిప్లైలు ఇస్తున్నారు.
Nenu ekada unano Chepandi chuddham. pic.twitter.com/OgKBY3GDuP
— Jaggu Bhai (@IamJagguBhai) February 22, 2025